ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల, జూన్ 23న పోలింగ్

Andhra Pradesh Atmakur Assembly Bye-election Schedule Released Polling on June 23rd, Atmakur Assembly Bye-election Schedule Released, Atmakur Assembly Bye-election Polling on June 23rd, Atmakur Assembly Bye-election Schedule, Polling on June 23rd, Atmakur Assembly Bye-elections, Bye-elections, Atmakur Assembly, Central Election Commission releases schedule for Atmakur Assembly Bye-elections, Atmakur Assembly Bypoll On June 23, Atmakur Assembly Bypoll, By-election to Atmakur assembly, ECI announces bypoll for Atmakur Assembly, Atmakur Assembly Bye-elections News, Atmakur Assembly Bye-elections Latest News, Atmakur Assembly Bye-elections Latest Updates, Atmakur Assembly Bye-elections Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ ఉప ఎన్నిక కోసం మే 30న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జూన్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించి, జూన్ 26వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణించడంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ప్రస్తుతం ఉపఎన్నిక జరగనుంది.

ఆత్మకూరుతో పాటుగా త్రిపురలో నాలుగు, ఢిల్లీ, జార్ఖండ్ లలో ఒక్కో అసెంబ్లీ స్థానాలకు మరియు ఉత్తర్ ప్రదేశ్ లో రెండు, పంజాబ్ లో ఒక పార్లమెంట్ స్థానానికి కూడా జూన్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీఐ మే 25, బుధవారం రాత్రి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఆయా ప్రాంతాల్లో మే 25 నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది.

ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – మే 30
  • నామినేషన్లకు ఆఖరితేదీ – జూన్ 6
  • నామినేషన్ల పరిశీలన – జూన్ 7
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – జూన్ 9
  • పోలింగ్ జరిగే తేదీ – జూన్ 23
  • ఓట్ల లెక్కింపు – జూన్ 26

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =