అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు, సంప్రదాయబద్ధంగా చాదర్ సాగనంపిన సీఎం కేసీఆర్

Ajmer Dargah, Ajmer Dargah chader, Ajmer Dargah Urs, Ajmer Dargah Urs Celebrations, CM KCR, CM KCR Presented Chader Ajmer Dargah, CM KCR sends chader to Ajmer Dargah, KCR has Seen off the Chader to be Presented at Ajmer Dargah, KCR Presented Chader, Latest News on ajmer dargah, Mango News, Muslims display Ajmer Dargah chader to CM KCR, Telangana CM KCR, Telangana CM sends chadar

అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్) ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు సంప్రదాయబద్ధంగా సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ ను ముస్లిం మత పెద్దలు సీఎం ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమించాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సీఎం కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fifteen =