కరోనా నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన వారికీ మరో నెల రోజులు హోం క్వారంటైన్‌

AP Corona updates One Month Home Quarantine for Above 60 Years People, andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులతో పాటుగా, మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏళ్ల వయసు పైబడిన పెద్దవాళ్ళు, మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్, హెచ్‌ఐవీ, ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారంతా బయటకు రాకుండా మరో నెలరోజులు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. వైరస్‌ సోకితే ఎక్కువ ప్రభావం కలిగే అవకాశమున్న వీరందరికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు కీలక సూచనలు చేస్తున్నారు. అలాగే వీరంతా హైరిస్క్‌ కేటగిరీలో ఉన్నందు వలన కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద వహించి జాగ్రత్తలు తీసుకునేలా గ్రామాలు, పట్టణాలలో ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయిస్తుంది.

రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారు 50 లక్షల మంది వరకు ఉన్నారని, వీరు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలని కోరుతున్నారు. వీరికి ప్రత్యేక గది కేటాయించి, బయటకి వెళ్లి వచ్చే కుటుంబ సభ్యులు వీరికి దూరంగా ఉండడం మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుతున్న మందులు కొనసాగించాలని, మందుల వాడకాన్ని ఆపకూడదని చెప్పారు. అయితే కొంతమంది ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్స్ వాడుతున్నారని, వైద్యుల నుంచి ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని వాడకూడదని తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu