ఐజీఎస్టీ కమిటీలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు చోటు

Telangana Minister Harish Rao

ఐజీఎస్టీ పరిష్కారం, సలహాలు, సంబంధిత వ్యవహారాల కోసం 2019 డిసెంబర్‌లో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీలో మార్పులు చేస్తూ జూలై 22, బుధవారం నాడు జీఎస్టీ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు మంత్రులతో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌ రావుకు చోటు దక్కింది. అలాగే ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ వ్యవహరించనున్నారు. మంత్రి హరీశ్ రావుతో పాటుగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఒడిశా ఆర్థిక మంత్రి నిరంజన్ పుజారి, తమిళనాడు మంత్రి డి. జయకుమార్, ఛత్తీస్‌ గడ్ కమర్షియల్ టాక్స్ మంత్రి టిఎస్ సింగ్ థియో, పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కు ఈ కమిటీలో చోటు కల్పించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =