ఏపీలో కొత్తగా 5879 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

AP Covid-19 Updates: 5879 New Positive Cases and 9 Deaths Reported in Last 24 Hours

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5,879 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856, తూర్పుగోదావరిలో 823, వైఎస్ఆర్ కడపలో 776 నమోదయ్యాయి. దీంతో జనవరి 31, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,76,370కు, మరణాల సంఖ్య 14615 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 11,384 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 21,51,238 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(5,879):

  1. అనంతపురం – 856
  2. తూర్పుగోదావరి – 823
  3. కడప – 776
  4. కృష్ణా – 650
  5. కర్నూల్ – 483
  6. పశ్చిమగోదావరి – 456
  7. గుంటూరు – 421
  8. నెల్లూరు – 366
  9. విశాఖపట్నం – 340
  10. ప్రకాశం – 321
  11. చిత్తూరు – 295
  12. శ్రీకాకుళం – 80
  13. విజయనగరం – 12
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ