ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. విద్యార్ధులకు హాల్ టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

10th Class Public Exams Starts From Today in AP and Telangana RTC Provides Free Bus Service For The Students,10th Class Public Exams Starts From Today,10th Class Public Exams in AP and Telangana,RTC Provides Free Bus Service For The Students,RTC Free Bus Service For 10th Students,Mango News,Mango News Telugu,Students can travel in TSRTC buses for free,AP SSC Students Can Travel in APSRTC For Free,TSRTC Provides Free Bus Ride,APSRTC to provide free travel,APSRTC Latest News,TSRTC Latest Updates

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 11.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ఎస్ఎస్‌సీ బోర్డులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. కేంద్రాల్లో వద్ద పోలీసులను మోహరించడంతో పాటు, వందల కొద్దీ ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 156 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించగా.. తెలంగాణలో 144 ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన పరీక్షలు జరిగే తరగతి గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో 18 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనుండగా.. తెలంగాణలో 13 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పదో తరగతి విద్యార్ధుల కోసం అదనపు బస్సులను నడిపించడంతో పాటు, హాల్ టికెట్లు చూపిస్తే ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకున్నారు.

కాగా ఏపీలో మొత్తం 6,09,070 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. వీరి కోసం విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరుగనున్నది. ఇక కంట్రోల్ రూం ద్వారా అన్ని డిపార్టుమెంట్ల అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 11,456 పాఠశాలలకు చెందిన 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనున్నది. ఇక ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఏపీ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో మాత్రం చివరి నిమిషంలో వచ్చే విద్యార్థుల కోసం ఐదు నిమిషాలు అదనపు సమయం కేటాయించనున్నారు. ఈ క్రమంలో 9:35 గంటలకు గేట్లు మూసివేస్తారు.

పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు..

  • ఉదయం 8.45 నుంచి 9.30 లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఏపీలో ఒక్క నిమిషం లేట్ అయినా అనుమతించరు.
  • తెలంగాణలో ఐదు నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. 9:35 గంటలకు గేట్లు మూసివేస్తారు.
  • విద్యార్థులు తమ వెంట మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమేరాలు, ఇయర్‌ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు వంటివి తీసుకెళ్లకూడదు.
  • వాటర్‌ బాటిల్‌, పెన్‌, పెన్సిల్‌, ఇతర స్టేషనరీని సెంటర్‌లోకి తీసుకెళ్లవచ్చు.
  • అత్యవసర పరిస్థితుల్లో మినహా పరీక్ష పూర్తయ్యేవరకూ విద్యార్థులను బయటకు పంపరు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =