కరోనా వైద్య పరీక్షలు ఎవరు చేయించుకోవాలి?

Corona Tests, Coronavirus Effect, Coronavirus impact, Coronavirus in India live updates, coronavirus test, coronavirus test guidelines, Coronavirus Updates, COVID 19 Test Guidelines, COVID 19 Tests, COVID-19, Guidelines On Corona Tests, how to test corona, Ministry of Health and Family Welfare

దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59, ఆంధ్రప్రదేశ్ లో 13 నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందే విధానం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎవరైనా తుమ్మినా, దగ్గినా కూడా ఇతరులు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో సాధారణ ఫ్లూ లక్షణాలకు కూడా కరోనా వైరస్‌ సోకిందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి, ఎవరికీ అవసరం లేదు వంటి వివరాలతో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఒక సమాచారపత్రాన్ని విడుదల చేసింది.

కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు:

 • అందరు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు.
 • విదేశీ ప్రయాణ నేపధ్యం కలిగిన వారు మరియు కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలి.
 • గత 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి.
 • కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులతో కలిసి తిరిగిన వారు కూడా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి.
 • హెల్త్ కేర్ వర్కర్స్ కూడా పరీక్షలు చేయించుకోవాలి
 • శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, ఇతర తీవ్రమైన వ్యాదులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
 • ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వ్యక్తికీ చికిత్స అందించిన సమయంలో జాగ్రత్తలు వహించని హెల్త్ వర్కర్స్ అందరు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే.
 • కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి తో కలిసున్నా కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకోవాలి.

కరోనా హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా:

 • ఆంధ్రప్రదేశ్ : 0866-2410978
 • అరుణాచల్ ప్రదేశ్ : 9436055743
 • అండమాన్ & నికోబార్‌ : 03192232102
 • అసోం: 6913347770
 • బీహార్: 104
 • ఛత్తీస్‌గఢ్ : 07712235091
 • డీల్లీ : 01122307145
 • దాద్రా నగర్ హవేలి: 104
 • దామణ్‌ దీవ్‌: 104
 • గోవా: 104
 • గుజరాత్‌: 104
 • హర్యాణా: 8558893911
 • హిమాచల్ ప్రదేశ్: 104
 • జమ్మూ: 01912520982
 • ఝార్ఖండ్: 104
 • కశ్మీర్: 01942440283
 • కేరళ: 04712552056
 • కర్ణాటక: 104
 • లద్దాఖ్: 01982256462
 • లక్షద్వీప్: 104
 • మధ్యప్రదేశ్ : 0755-2527177
 • మహారాష్ట్ర: 020-26127394
 • మేఘాలయ: 108
 • మిజోరం: 102
 • నాగాలాండ్: 7005539653
 • ఒడిశా: 9439994859
 • పంజాబ్: 104
 • పుదుచ్చేరి: 104
 • పశ్చిమబెంగాల్: 3323412600
 • రాజస్థాన్: 01412225624
 • సిక్కిం: 104
 • తమిళనాడు: 04429510500
 • త్రిపుర: 03812315879
 • ఉత్తరాఖండ్: 104
 • ఉత్తర్‌ప్రదేశ్: 18001805145

ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:

కరోనా ఎఫెక్ట్: మాస్కులు ఎవరు వాడాలి? ఎలా వాడాలి?

కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాల హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా విడుదల చేసిన కేంద్రం

కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా అలర్ట్‌: పోస్టర్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here