కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 20, మంగళవారం నుండి అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కాగా పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని, వారికీ ఈ విద్యా సంవత్సరం పూర్తయినట్లుగా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ