పంచాయతీ ఎన్నికలు జరిగే 4 రోజులు స్థానిక సెలవు దినాలు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt Announces Local Holidays on Panchayat Election Days

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో నాలుగుదశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో స్థానిక సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది. ఆయా తేదీల్లో స్థానికంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు సెలవు ప్రకటించారు. అలాగే పోలింగ్ జరిగే రోజుకు 44 గంటలకు ముందు ఆయా ప్రాంతాల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఎన్నికల ఏజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని, ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వివిధ అంశాలపై
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ