ఇకపై రైతు దినోత్సవంగా వైఎస్ఆర్ జయంతి, ఏపీ ప్రభుత్వం ప్రకటన

Andhra Pradesh, Andhra Pradesh News, AP Farmers Day, AP Govt, AP Govt Announces YSR Birth Anniversary As Farmers Day, AP News, YSR Birth Anniversary, YSR Birth Anniversary As Farmers Day

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకనుంచి ప్రతి ఏడాది వైఎస్ఆర్ జయంతి రోజైన జూలై 8 వ తేదీని రైతు దినోత్సవంగా జరపనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ జూన్ 29, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని, ఆయన స్మారకంగా రైతు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu