రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలుచేస్తున్న కర్ఫ్యూను మరో వారం రోజుల పాటుగా జూలై 21 వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 21వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. మాస్కులు ధరించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.100 జరిమానాను విధించనున్నారు. మాస్క్ అన్ని సమయాల్లో ముక్కు మరియు నోటిని కప్పివుంచేలా ధరించాలని సూచించారు.
మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా:
ఇక కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్కులు లేని వారిని అనుమతిస్తే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ జరిమానా మొత్తాన్ని అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖరారు చేయనున్నట్టు తెలిపారు. అలాగే మార్కెట్స్ లేదా వాణిజ్య సంస్థల్లో కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించడంలో ఏదైనా ఉల్లంఘనలు జరిగితే పరిస్థితిని బట్టి 1 లేదా 2 రోజులపాటు సంబంధిత సంస్థను మూసివేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి ఆ ఫొటోలు పంపినా కూడా నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాంటి దుకాణాలు, సంస్థలను వారం పాటు మూసివేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ నెంబరును ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని, ఈ సమయంలో ఐదుగురికి మించి ఓ చోట జనం గుమికూడకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. వస్తువులు మరియు ఇతర అవసరాల కొనుగోలు చేయడానికి భౌతిక దూర నిబంధనలను అనుసరిస్తూ, క్యూలలో నిలబడే వ్యక్తులకు ఈ 144 సెక్షన్ వర్తించదని చెప్పారు. ఈ నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ