అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు

11 YCP MPs will contest the assembly elections,11 YCP MPs will contest,the assembly elections,CM Jagan. YCP, Assembly elections, YCP Candidates,Mango News,Mango News Telugu,YSRCP High Command,YSR Congress Party,Assembly Elections Latest News,Assembly Elections Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
CM Jagan. YCP, Assembly elections, YCP Candidates

అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. జనాదరణ తగ్గిపోయిన నేతలకు షాక్ ఇచ్చేందుకు కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు. జనాల్లో ఎక్కువగా నెగిటివిటీ ఉన్న సిట్టింగ్‌లు, మంత్రులు, సీనియర్లనే ఈసారి పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్‌లను ఛేంజ్ చేసిన జగన్.. మరికొంత మందిని కూడా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జ్‌ల మార్పు అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే కొందరు సిట్టింగ్‌లను అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు. చీపురుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా.. విజయనగరం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట.  అలాగే  ఈసారి కొందరు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట. కీలక స్థానాల్లో ఎంపీలకు టికెట్ ఇచ్చి రణరంగంలోకి దింపనున్నారట. ఎంపీలను రంగంలోకి దింపడం ద్వారా ఆ స్థానాన్ని కచ్చితంగా గెలుచుకొని తీరుతామని జగన్ భావిస్తున్నారు.

ఈక్రమంలో మొత్తం 11 మంది ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని జగన్ వ్యూహాలు పన్నుతున్నారట. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌ను రాజమండ్రి అర్బన్ నుంచి.. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నుంచి.. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని పీలేరు నుంచి  అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారట. అలాగే ఆయా స్థానాల్లోని సిట్టింగ్‌లు అలకబూనకుండా పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి కీలక పదవులు ఇస్తామని హామీ ఇవ్వనున్నారట.

ఇక పి.గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును ఈసారి పక్కన పెట్టి.. ఆ స్థానం నుంచి అమలాపురం ఎంపీ చింతా అనురాధను పోటీ చేయించనున్నారట. అలాగే జమ్మలమడుగు టికెట్‌ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉందట. అయితే ఏ స్థానం నుంచి ఆయన్ను బరిలోకి దింపుతారనేదానిపై త్వరలో స్పష్టత రానుంది. మరి ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం వైసీపీకి కలిసొస్తుందా? లేదా? అనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 7 =