ఏపీలో రోడ్ టాక్స్ చెల్లింపు గడువు సెప్టెంబర్ 30 వరకు పెంపు

AP Govt, AP Govt Extends Road Tax Payment Deadline, AP News, AP Road Tax, Govt Extends Tax Deadlines, Road Tax, Search Results Web results Andhra Pradesh, Taxes on Vehicles

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంలో ఉన్నవారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సహా, ఆ రంగంలోని ఇతరుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్‌ ట్యాక్స్‌ చెల్లింపునకు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్‌ 30 వరకు రోడ్ టాక్స్ గడువు పొడిగిస్తూ జూలై 31, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

రవాణా వాహనాలకు ప్రతి మూడు నెలలకు ఓసారి రోడ్‌ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అదికూడా క్వార్టర్‌ ప్రారంభ నెలలోనే చెల్లించాలి. ప్రభుత్వం తాజాగా గడువు పెంచడంతో రెండు, మూడు క్వార్టర్లకు సంబంధించి రోడ్‌ ట్యాక్స్‌ ను ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్‌ 30 వరకూ చెల్లించే వెసులు బాటు వారికి కలగనుంది. రాష్ట్రంలో ఆటోలు, ట్యాక్సీలు, లారీలు, ప్రైవేటు బస్సులు, ఇతర రవాణా వాహనాలు అన్ని కలిపి దాదాపుగా 17 లక్షల వరకూ ఉన్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu