జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Thanked All the People Involved in Grand Success of Party's 10th Formation Day Meet,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Thanked All the People,Janasena Chief Thanked People Involved in Formation Day,Grand Success of Partys 10th Formation Day Meet,Janasena Partys 10th Formation Day Meet,Mango News,Mango News Telugu,Pawan Kalyan Full Speech,Pawan Kalyan Public Meeting Live,Pawan Kalyan Full Speech at Machilipatnam,Pawan Kalyan on Varahi Vehicle,AP Politics,AP Latest Political News,Andhra Pradesh News and Live Updates,Janasena Formation Day Latest Updates,Jana Sena Foundation Day Celebration

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మార్చి 14, మంగళవారం సాయంత్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి మొదలైన వారాహి యాత్రను, మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“దారి పొడవునా హారతులిచ్చి ఆశీర్వదించిన ఆడపడుచులను, సాదర స్వాగతం పలికిన జనసేన శ్రేణులను ఎప్పటికీ మర్చిపోను. సభకు అశేషంగా హాజరైన జన సైనికులు, వీర మహిళలకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. వారాహి యాత్ర, సభ ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్లకు అభినందనలు. వారాహి యాత్ర, సభ నిర్వహణలో పాలుపంచుకున్న పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి, పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, లీగల్ సెల్, ఐటీ సెల్, డాక్టర్స్ సెల్ సభ్యులకు, చేనేత, మత్స్యకార వికాస విభాగాల సభ్యులకు, కృష్ణా జిల్లా కమిటీ, విజయవాడ నగర కమిటీలకు అభినందనలు. ఆవిర్భావ దినోత్సవ సభాస్థలికి, పార్కింగ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. సభ సహకరించిన పోలీసు శాఖకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా పాత్రికేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 10 =