రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు సమయం పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పనివేళలు మార్పు చేస్తూ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పనివేళలుగా నిర్ణయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కర్ఫ్యూ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవనున్న నేపథ్యంలో ఇంటికెళ్లేందుకు వీలుగా గంట ముందుగానే సాయంత్రం 5 గంటల వరకే పనివేళలు ఉండనున్నాయి. ఈ పనివేళలు జూన్ 21 నుంచి జూన్ 30వ తేదీ వరకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉద్యోగులకు పనివేళలుగా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముందుగా రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను జూన్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో జూన్ 21 నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు సమయం అమల్లోకి రానుంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ