వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మార్చుతున్నాం : సీఎం కేసీఆర్

CM KCR Announced That Warangal Urban District Name Changed, CM KCR Announced That Warangal Urban District Name Changed as Hanamkonda District, Hanamkonda District, KCR renames Warangal Urban district, KCR renames Warangal Urban Hanamkonda, Mango News, Telangana CM KCR, Telangana Warangal Urban district, Telangana’s Warangal Urban district to be renamed, Warangal to get 33-floor hospital, Warangal Urban district’s name to be changed

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు​ సోమవారం నాడు వరంగల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బహుళ అంతస్తుల్లో అన్ని సదుపాయాలతో, అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మితమైన వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా కొత్త కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా మార్చుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలాగే ఇకపై వరంగల్‌ రూరల్ జిల్లా వరంగల్ జిల్లాగా ఉంటుందని చెప్పారు. జిల్లాల పేరు మార్పులకు సంబంధించిన ఉత్త‌ర్వులును రెండు, మూడు రోజుల్లోనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.

అన్ని సదుపాయాలతో ఉన్న కలెక్టరేట్‌ నిర్మించినందుకు ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు ప్రారంభమైన కలెక్టరేట్ ను హ‌న్మ‌కొండ జిల్లాకు పరిగణించాలని, దీనికి సమీపంలో నిర్మించబోయే కలెక్టరేట్ ను వరంగల్ జిల్లా కలెక్టరేట్ గా పరిగణించాలని సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో ఇతర జిలాల్లో కూడా కలెక్టరేట్‌ భవనాలు బాగున్నాయని సీఎం పేర్కొన్నారు. మరోవైపు వరంగల్‌ కేంద్ర కారాగార స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని మంత్రులకు, అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − two =