ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు/టీచర్లకు బోధనేతర విధులను ఇవ్వకూడదని నిర్ణయించింది. ఉపాధ్యాయులుకు బోధనేతర బాధ్యతల ఇవ్వకూడదనే నిబంధన చట్ట సవరణకు ముందుగా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది అనంతరం నవంబర్ 29, మంగళవారం నాడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఉపాధ్యాయులు పిల్లల తరగతి మరియు వయస్సుకు సంబంధించి వారి విద్యా విషయక విజయాల స్థాయిలను మెరుగుపరచడానికి, మరియు బోధన యొక్క ప్రధాన కార్యాచరణలోనే తమ సమయాన్ని కేంద్రీకరించాలి, అంకితం చేయాలని అన్నారు. వీలైనంత వరకు ఉపాధ్యాయులు పాఠశాలల్లో బోధన మరియు ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలు మినహా మరే ఇతర కార్యకలాపాల కోసం నిమగ్నమై ఉండకూడదని లేదా డ్రాఫ్ట్ చేయకూడదని తెలిపారు. ఏదైనా అనివార్య పరిస్థితుల సందర్భంలో, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరినీ మోహరించిన తర్వాత, అలాంటి ప్రయోజనాలను నెరవేర్చడానికి మరింత సిబ్బంది అవసరం ఉన్న సమయంలో మాత్రమే ఉపాధ్యాయులను బోధనేతర కార్యకలాపాల్లో వినియోగించాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE







































