ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల రద్దుకు సంబంధించి జూలై 14, మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. ఎస్ఎస్‌సీ, ఓఎస్ఎస్‌సీ, ఒకేషనల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చ్-2020 పదో తరగతి పరీక్షలకు నమోదు చేసుకుని హాల్ టికెట్స్ పొందిన విద్యార్థులంతా ఉత్తీర్ణులు అయినట్టుగా పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్ పాయింట్లు ఇవ్వకుండానే ఉత్తీర్ణుల్ని చేసినట్టుగా తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu