ఏపీలో కూటమి వల్ల బీజేపీకే లబ్ధి

BJP benefit, alliance in AP, YCP, Pawan Kalyan, Chandrababu, TDP, Janasena, BJP, YCP, CM Jagan, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,YSRCP
BJP benefit , alliance in AP,YCP,Pawan Kalyan, Chandrababu, TDP, Janasena, BJP, YCP, CM Jagan,

ఏపీలో టీడీపీ,జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఈ కూటమి వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న ఆరాలు ఎక్కువయిపోయాయి. ఇప్పటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి ఏం ఇచ్చిందన్న లెక్కలను తవ్వి తీస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రజలకు నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పోలవరం పూర్తి చేసి, పరిశ్రమలకు రాయితీ ఇచ్చి, రాజధాని నిర్మాణానికి సహాయం చేసి ఏపీ ప్రజలను ఓట్లు అడిగితే.. బీజేపీ సొంతంగా పోటీ చేసినా కూడా ఆదరణ దక్కేది.

కానీ పదేళ్లుగా విభజన సమస్యల పరిష్కారంలో మోడీ సర్కార్ చొరవ చూపెట్టలేదు. ఏపీకి యూపీఏ గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు వైసీపీని గద్దె దించడానికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడం హాట్ టాపిక్ అయింది.అయితే వైసీపీకి కేంద్రం ఎంతగా సహకరించిందో అందరికీ తెలుసు. అలాగే జగన్ సర్కార్ కు ఎన్ని పాలనా వైఫల్యాలు ఉన్నాయో అంత కంటే ఎక్కుడ వైఫల్యాలు మోడీ ప్రభుత్వానికి ఉన్నాయి.

అంతేకాదు ఏపీలో బీజేపీకి బలమే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీని కూటమిలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు చేస్తున్న ప్రయోగమే అంటున్నవాళ్లు ఉన్నారు. అధికారికంగా వెల్లడించకపోయినా. బీజేపీ, జనసేనలకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లను ఇవ్వడానికి తెలుగు దేశం పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది.

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు .కానీ బీజేపీ కూడా కూటమిలో భాగం అవడంతో.. మరో 6 అసెంబ్లీ సీట్లు, 5 లోక్‌సభ సీట్లు జనసేన, బీజేపీలకు ఇచ్చారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఈ రెండు పార్టీలు ఎవరు ఎన్నిస్థానాల్లో పోటీ చేయనున్నారన్నదానిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రాబోతుంది.

ఏపీలో అసలు బలమే లేని కాషాయ పార్టీ.. పవన్‌ కళ్యాణ్‌ను ముందుపెట్టి కూటమిలోకి అడుగుపెట్టింది. చంద్రబాబు తప్పని సరి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించాల్సి వచ్చింది. కూటమిలోకి కాషాయ పార్టీ చేరాక.. వామపక్షాలు కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయవచ్చు. అది వైసీపీకి పరోక్షంగా మేలు చేస్తుందనేది విశ్లేషకుల మాట.

జనసేన ద్వారా కూటమిలోకి ఎంటర్ అయిన బీజేపీ.. అక్కడ టీడీపీ ద్వారానే తన బలాన్ని, ఓటు బ్యాంకును పెంచుకోబోతోంది.టీడీసీ సొంతంగా మెజారిటీ మార్క్‌ దాటకపోతే.. భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ జోక్యం తప్పకుండా ఉంటుందన్న విషయం కూడా అందరికీ ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది.

కూటమి ఓడిపోయినా కాషాయ పార్టీకి ఒరిగేది ఏమీలేదు. కానీ గెలిస్తే మాత్రం బాబు, పవన్‌ ఛరిష్మాతో బీజేపీ 2,3 ఎంపీ సీట్లు, 4,5 అసెంబ్లీ సీట్లు తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఏపీలో ఎవరు గెలిచినా కేంద్రంలో తమకు మద్దతుగా ఉంటారనేది కమలం పార్టీ పెద్దల ఆలోచన. అందుకే ఓడపోతే..ఎలాగూ అన్నిటికీ ఎస్ అంటున్న జగన్ తమ మాట వింటారు. గెలిస్తే టీడీపీ, జనసేన తమ మాట వింటారు అనే నమ్మకంతో బీజేపీ పెద్దలున్నారనే ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =