దేశవ్యాప్తంగా మూడోవిడత లాక్‌డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మే 14 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయగా, తాజాగా మే 16, శనివారం నాడు లాక్‌డౌన్ సడలింపులపై మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాలు పాటించేలా చూడాలని అధికారులకు సూచించింది.
ఏపీలో తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలు:
- వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, అమ్మకాలు, కొనుగోళ్ళకు ఎలాంటి ఆటంకం కలగవద్దు.
- విత్తనాలు, ఎరువులు అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
- కూలీల రవాణాపై దృష్టిసారించాలి.
- కంటైన్మెంట్ ప్రాంతాల మినహా వ్యవసాయ పనులకు ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు.
- వ్యవసాయానికి సంబంధించిన యంత్రాల దుకాణాలు, మరమ్మత్తుల దుకాణాలు ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు తెరిచేందుకు అనుమతి.
- దుకాణాల వద్ద ప్రజలు గుమికూడకుండా యాజమాన్యం, అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఏపీలో ఇటీవల ప్రకటించిన కొన్ని మార్గదర్శకాలు:
- రాష్ట్రంలో కంటైన్‌మెంట్, బఫర్‌జోన్లు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరచుకునేందుకు అవకాశం.
- కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అనుమతి.
- రూరల్, అర్బన్ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ తెరవడానికి అనుమతి లేదు.
- బంగారం దుకాణాలు తో పాటుగా వస్త్ర, చెప్పుల దుకాణాలు తెరవడానికి కూడా అనుమతి లేదు.
- దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా దుకాణాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
- అలాగే దుకాణాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
- లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu