అయోమయంలో వసంత పొలిటికల్ కెరీర్

Mylavaram, vasanta krishna prasad, AP Politics, AP Elections, Political Career, YSRCP, Mylavaram YCP MLA, YCP MLA, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Political Updates, Andhra pradesh, Mango News Telugu, Mango News
Mylavaram, vasanta krishna prasad, AP Politics, AP Elections

మైలవరం రాజకీయాలు రోజుకో విధంగా ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జగన్ తీరుపై అసంతృప్తితో వైసీపీ నుంచి బయటకు వచ్చిన  వసంత కృష్ణ ప్రసాద్‌ రూట్ ఎటు అంటూ ఏపీ వ్యాప్తంగా కొత్త చర్చలు షురూ అయ్యాయి. మైలవరం ఏ పార్టీలో చేరుతారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీని కాదని వచ్చిన ఆయన..టీడీపీ, కాంగ్రెస్‌, జనసేనలో ఇప్పుడు ఏ పార్టీలోకి వెళతారో అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే  రాజకీయ చౌరస్తాలో నిలబడ్డ వసంత కృష్ణ ప్రసాద్‌ తీరుపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.

2019లో  కృష్ణా జిల్లా మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్సార్‌‌సీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే సర్వేలను మాత్రమే నమ్ముకున్న సీఎం జగన్.. మరికొద్ది రోజుల్లో  రాబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కోసం మైలవరం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు వసంతకు కాకుండా మరొకరికి అప్పగించారు. అయితే కొద్ది రోజులుగా తనకు టికెట్ దొరకదన్న సమాచారంతో అప్పుడప్పుడు వైసీపీపై అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా అదే జరగడంతో వసంత వైసీపీని వీడారు. దీంతో కొద్ది రోజుల్లో  వసంత టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.

వైసీపీ నుంచి బయటకు వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్.. తాను ఎందుకు పార్టీని విడవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చి త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని చెప్పారు. కానీ  తాజాగా నందిగామ జనసేన ఇన్‌ఛార్జ్‌తో జరిగిన భేటీలో అతని కొడుకు వసంత నాగేశ్వరరావు మాత్రం..వసంత కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరారని  కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకుల వాదనలు భిన్నంగా ఉండటంతో.. మైలవరం తెలుగు తమ్ముళ్లంతా సమావేశమయ్యారు.

వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి ఎలా వస్తారని..అసలు టీడీపీ నుంచి అతనిని ఎవరు ఆహ్వానించారో  చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 4 వందల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించిన వసంత..ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా చేరతారని నిలదీశారు. మరి వసంతకు టీడీపీ నుంచి ఆహ్వానాలు అందాయా? వసంతను జనసేన, కాంగ్రెస్‌ నుంచి కూడా ఆహ్వానాలు అందాయా? వసంత టీడీపీలో చేరారన్న నాగేశ్వరరావు మాటల్లో నిజం ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు టీడీపీ కేడర్‌ వసంతను వ్యతిరేకిస్తుండటంతో ఆయన డైలమాలో పడ్డారా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 8 =