రాష్ట్రంలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ విధానంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు సొంత గ్రామంలో కాకుండా గత ఆరు నెలలుగా ఏపీలోనే మరో ప్రాంతంలో నివాసం ఉంటుంటే, వారు ఉన్న చోటనే పింఛన్ అందించేలా నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని పొందేందుకు వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, ఆ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే సొంత గ్రామాన్ని వదిలి కనీసం ఆరు నెలలు దాటితేనే ఈ పద్ధతిలో పింఛన్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా డీఆర్‌డీఏ పీడీలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఇంతియాజ్‌బుధవారం నాడు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ