పేదల కడుపు నింపే ‘అన్న క్యాంటీన్ల’ను ధ్వంసం చేయడం దారుణం – కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu Slams Demolishing of Anna Canteen in Kuppam While The Third Day Visit, Naidu Slams YSRCP Govt For Closing Anna Canteens, Chandrababu Naidu Protest In Kuppam, Anna Canteen Closes In Kuppam, Mango News, Mango News Telugu, Anna Canteen, TDP Chief Chandrababu Naidu, YSR Congress Party, AP CM YS Jagan Mohan Reddy, Chandra Babu Naidu Protest Against YSRCP, Chandrababu Naidu Latest News And Updates, Kuppam Anna Canteen, Kuppam Anna Canteen Live Updates,Chandrababu Naidu Kuppam Visit,Chandrababu Naidu Kuppam Tour

పేదల కడుపు నింపే ‘అన్న క్యాంటీన్ల’ను ధ్వంసం చేయడం దారుణం అని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం కుప్పంలో ఆయన మూడో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన నేడు నియోజకవర్గంలోని కృష్ణానంద పల్లి, గుండ్లనాయన పల్లి, కొత్తూరుల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్ షోలో భాగంగా పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ ధర్మ పోరాటానికి ప్రజల సహకారం అందించాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యనిషేధం అమలుచేయమని హామీ ఇచ్చారని, కానీ నేడు అదే మద్యాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, నిన్న కుప్పంలో ఏం జరిగిందో రాష్ట్రమంతా చూసిందని తెలిపిన చంద్రబాబు చివరకు పేదలకు అన్నం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటీన్లను కూడా వైసీపీ వదలడం లేదని దుయ్యబట్టారు. తనను కుప్పంలో అడుగు పెట్టకుండా చేయడానికి సామాన్యులను బాధ పెడుతున్నారని, పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తే ఆనాడు పాదయాత్రలు చేయగలిగేవారా అని ఆయన ప్రశ్నించారు. అలాగే టీడీపీ హయాంలో 650 గృహాలతో మోడల్‌ కాలనీ నిర్మాణం ప్రారంభించి వన్‌ ప్లస్‌ త్రీ విధానంలో మూడు వేల మందికి ఇవ్వడానికి సిద్ధం చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నిలిపివేసిందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 6 =