ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్ రైతు భరోసా (ఆర్బీకే) కేంద్రాల పరిధిలో ఖాళీగా ఉన్న మొత్తం 7,384 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అన్నదాతలకు విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రత్యేక సేవలందించడం కోసం ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీకే కేంద్రాల సేవలను, పనితీరుని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం వీటిల్లో 14,347 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు.
ఈ క్రమంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్బీకేల ఏర్పాటు సందర్భంగా మంజూరైన పోస్టుల సంఖ్యను బట్టి అధికారులు శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. వీటిలో గరిష్టంగా 5,188 పశుసంవర్ధక సహాయకుల పోస్టులు ఖాళీగా ఉండగా, హార్టికల్చర్ 1,644 పోస్టులు, అగ్రికల్చర్ 467 పోస్టులు, ఫిషరీస్ 63 పోస్టులు, సిల్క్ అసిస్టెంట్ పోస్టులు 22 వరకు ఖాళీగా ఉన్నాయి. కాగా ఈ పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీ నేతృత్వంలో చేపట్టనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఆర్బీకేల పరిధిలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 21,731కి చేరనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE