కీలక సమయంలో కేంద్రానికి వైసీపీ మద్దతు

YSRCP Extends Vital Support To Center in Crucial Time Ahead of Several Key Bills in Parliament,YSRCP Extends Vital Support To Center,Vital Support To Center in Crucial Time,YSRCP Ahead of Several Key Bills,Several Key Bills in Parliament,YSRCP Support To Center,Mango News,Mango News Telugu,YSR Congress Party Extends Vital Support,PM Modi Seeks Jagans Support,2023 Indian Parliament Monsoon Session,A motion of no confidence in Parliament, AP Politics, bjp, BOTSA, CM Jagan, Janasena, modi, TDP, YCP,YSRCP Latest News,YSRCP Latest Updates,YSRCP Live News,YSRCP Support To Center Latest News,YSRCP Support To Center Latest Updates

ఏపీలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన అవగాహనతో పనిచేస్తున్నాయి. ఎన్డీఏ సమావేశానికి పవన్ హాజరయ్యారు. టీడీపీకి పిలుపు లేదు. కానీ, ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఏపీ బీజేపీ నూతన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన పురేందశ్వరి తొలి రోజు నుంచి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో ఈ మూడు పార్టీల ఉమ్మడి లక్ష్యంగా జగన్ మారారు. కానీ, కేంద్రంలో మాత్రం బీజేపీ అధినాయకత్వానికి జగన్ మద్దతు అవసరం అయింది. పార్లమెంట్‌లో వచ్చే వారం కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానంతో పాటుగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సభ ముందుకు రానున్నాయి.

అవిశ్వాస తీర్మానం విషయంలో లోక్ సభలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. కానీ, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలో మాత్రం రాజ్యసభలో వైసీపీ మద్దతిస్తేనే బిల్లు గట్టెక్కే అవకాశం ఉంది. ఈ సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని తిప్పికొట్టాలని తాజాగా ఒక జాతీయ మీడియా చర్చలో వ్యాఖ్యానించారు. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదని అన్నారు. కేంద్రం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ సమాఖ్య స్పూర్తిని దెబ్బ తీయడం లేదని పేర్కొన్నారు. అందుకే ఈ రెండు విషయాల పట్ల వైసీపీ కేంద్రానికి మద్ధతిస్తుందని వెల్లడించారు. మణిపుర్ అంశంపై విపక్షాలు కేంద్రానికి మద్ధతుగా కలిసిరావాలని కోరారు. కేంద్రానికి వైసీపీ మద్దతు ఇవ్వనుందని దీంతో స్పష్టత వచ్చింది.

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో వ్యతిరేకిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాత్రం అవిశ్వాసంపై జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజ్యసభలో టీడీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. అవిశ్వాసం, ఢిల్లీ ఆర్దినెన్స్ బిల్లు విషయంలో టీడీపీ తమ వైఖరి అధికారికంగా వెల్లడించలేదు. బీజేపీ కోరితే మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో పొత్తు రాజకీయం వేళ కేంద్రానికి అవసరమైన వేళ మద్దతుగా వైసీపీ నిలుస్తోంది. దీని ద్వారా ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ పొత్తుపై ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పొత్తుల రాజకీయ ఎత్తుల్లో ఎవరి వ్యూహం ఫలిస్తుంది..ఎటువంటి మలుపులకు కారణం అవుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 18 =