మందు బాబులకు శుభవార్త: ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిల్స్ తెచ్చుకోవచ్చు

AP High Court, AP High Court Verdict over Liquor, AP High Court Verdict over Liquor Carrying to AP, AP High Court Verdict over Liquor Carrying to AP From Other States, AP News, Government of Andhra Pradesh, Verdict over Liquor Carrying to AP From Other States

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకుని రానివ్వకపోవడంపై దాఖలైన రిట్‌ పిటిషన్‌పై బుధవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీకి మద్యం తీసుకువచ్చే అంశంపై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జీవో 411 ప్రకారం గతంలో మాదిరిగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి 3 మద్యం బాటిల్స్ తెచ్చుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ జీవోను అమలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఏపీలో గత అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మద్యపాన నిషేధం హామీలో భాగంగా మద్యం దుకాణాల సంఖ్యను 33 శాతం తగ్గించడంతో మే నెల చివరి నుంచి రాష్ట్రంలో 4380 దుకాణాల్లో కేవలం 2934 దుకాణాలు మాత్రమే తెరుస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి మద్యం తీసుకురావడంపై నిషేధం కొనసాగుతుంది. రాష్ట్ర సరిహద్దులు, చెక్ పోస్టుల వద్ద రాష్ట్రంలోకి తరలించే మద్యం బాటిల్స్ ను ఎస్ఈబీ పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని, అనంతరం వాటిని ధ్వంసం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu