మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా.. కుమార్తె సునీతా రెడ్డి కీలక వ్యాఖ్యలు

Former Minister Vivekananda Reddy's Daughter YS Sunitha Key Comments During His Death Anniversary Today,Former Minister Vivekananda Reddy,Vivekananda Reddy's Daughter YS Sunitha Comments,YS Sunitha Comments During Vivekananda Reddy Death Anniversary,Vivekananda Reddy Death Anniversary Today,Mango News,Mango News Telugu,YS Viveka Daughter Calls for Justice,YS Viveka Case Turns Interesting,Sunitha Aims Guns At AP Govt,Vivekananda Reddy Latest News,Vivekananda Reddy Latest Updates,YS Vivekananda Reddy Murder Case,Vivekananda Reddy Death Anniversary Latest Updates,Andhra Pradesh Latest News

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె డా. సునీతా రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం ఉదయం వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల లోని వివేకా ఘాట్ వద్ద ఆమె అంజలి ఘటించారు. అనంతరం వైఎస్ సునీతా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య కేసు విచారణ దశలో ఉందని, ఈ సమయంలో దీనిపై మాట్లాడబోనని తెలిపారు. తన తండ్రి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యుల మీదే నిందలు వేస్తున్నారని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ ఇప్పటికే సీబీఐకి డాక్యుమెంట్స్ రూపంలో ఇచ్చానని వివరించారు. తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడితేనే సమాజంలో నేరాలు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు.

పిల్లలు తప్పు చేస్తే ఖండిస్తామని, అలాంటిది పెద్దలు తప్పు చేస్తే ఎలా వదిలి పెడతామని ప్రశ్నించిన సునీతా రెడ్డి, వివేకా హత్య కేసులో ఎంతటి వారైనా సరే బయటకు రావాలని ఆకాంక్షించారు. ఇక కడపకు అనేక విద్యా సంస్థలు వచ్చినందున అరాచకాలు తగ్గాయని భావించానని, కానీ తన తండ్రి హత్య చూసాక తగ్గలేదని అర్థమైందన్నారు. అలాగే తన తండ్రి హత్యపై కొందరు తేలికగా మాట్లాడారని, కడప, కర్నూలు ప్రాంతాల్లో ఇలాంటివి సాధారణమేనన్న రీతిలో వారు వ్యాఖ్యలు చేశారని, అయితే తన తండ్రిని ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలేస్తానని వైఎస్ సునీతా రెడ్డి ప్రశ్నించారు. కాగా వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని స్వగృహంలో దారుణంగా హత్య కావించబడ్డారు. ఇక ఈ కేసు ప్రస్తుతం తెలంగాణలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =