ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఒకవైపు పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు అధికార వైఎస్సార్సీపీ మాత్రం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలో రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పాటైన నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రేపు విశాఖపట్నంలో ‘విశాఖ గర్జన‘ పేరుతో భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టనుంది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం మంత్రి గుడివాడ అమరనాథ్ పోస్టర్‌ను కూడా విడుదల చేయడం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ.. రేపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీకి అధికార వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. విశాఖ గర్జనలో పాల్గొనాల్సిందిగా మంత్రులు గుడివాడ అమరనాథ్, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, కారణం ధర్మశ్రీ తదితరులు ఇప్పటికే వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాగా అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ హనుమంతు లజపతిరాయ్ ఈ జేఏసీకి కన్వీనర్‌గా ఎన్నికవగా.. ప్రొఫెసర్లు, వైద్య నిపుణులు, లాయర్లు, జర్నలిస్టులు, ఎన్జీవో అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు సహా మొత్తం 26 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజల మద్దతు కూడగట్టేందుకు అక్టోబర్ 15న విశాఖపట్నంలో ‘విశాఖ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తమ తొలి సమావేశంలోనే జేఏసీ ప్రకటించింది. ఈ క్రమంలో రేపు భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజలు భారీగా పాల్గొని తమ మద్దతు తెలపాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. ఇక విశాఖలో వాయు, నౌకాశ్రయం మరియు రైలు మార్గాలు ఉన్నందున హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పోటీపడే సామర్థ్యాన్ని కలిగి ఉందని, అందుకే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY