ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, కోలాహలంగా నాయకుల నామినేషన్లు

AP Local Body Elections, AP Local Body Elections 2021, AP Notification For Municipal Corporation ZPTC And MPTC By Elections, Mango News, Municipal Corporation ZPTC And MPTC By Elections, Notification For Municipal Corporation ZPTC And MPTC By Elections, Notification For Municipal Corporation ZPTC And MPTC By Elections In AP, Today Last Day for Nominations Submission, ZPTC And MPTC By Elections Nominations

ఏపీలో గతంలో ఎన్నికలు జరగకుండా మిగిలిన స్థానిక సంస్థలకు (కార్పోరేషన్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ) ఇటీవలే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ జారీ చేసిన అన్ని స్థానాల్లో నవంబర్ 3 నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవగా, నేటితో (నవంబర్ 5, శుక్రవారం) నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌, కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల సందడిపై చర్చ జరుగుతుంది. నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్ల కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, మరోసారి నెల్లూరు నగరాన్ని వైఎస్సార్సీపీకి అడ్డ అని నిరూపిస్తామని అన్నారు. నెల్లూరు నగర ,రూరల్ నియోజకవర్గాల్లో 54 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పారు. మరోవైపు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులకు గురువారం నాటికీ 124 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలు (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ), గ్రేటర్‌ విశాఖపట్నం కార్పోరేషన్ లో రెండు డివిజన్లు (32,61), 6 కార్పోరేషనల్లో12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో ఆగిపోయిన 187 ఎంపీటీసీ స్థానాలకు, 16 జడ్పీటీసీ స్థానాలకు, 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69 సర్పంచ్‌ పదవులకు, 533 వార్డు మెంబర్‌ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

పంచాయతీల్లో 14వ తేదీన, 15న మున్సిపాలిటీలు, కార్పోరేషన్లల్లో, 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. అలాగే పంచాయతీల్లో 14వ తేదీనే కౌంటింగ్‌ నిర్వహించనుండగా, మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో 17న, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో 18న కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నవంబర్ 1 నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ