ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా నీలం సాహ్ని నియామకం

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Ms. Sawhney replaced L.V. Subrahmanyam as the Chief Secretary, Nilam Sawhney Appointed As Chief Secretary, Nilam Sawhney Appointed As Chief Secretary Of Andhra Pradesh, Nilam Sawhney Appointed As Chief Secretary Of AP, Nilam Sawhney Appointed Chief Secretary, Secretary of the Central Vigilance Commission

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు నవంబర్ 13, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌ ఏపీ కేడర్ కు చెందిన నీలం సాహ్ని, డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఇటీవలే ఆమెను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేశారు. ఈ నేపథ్యంలో నీలం సాహ్నిను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(రాజకీయం) ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం తరువాత ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురువారం ఉదయం 11:20 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారిగా ఒక మహిళా ఐఏఎస్‌ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో ఆమె పదవీ విరమణ చేయనున్నారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here