స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్.. ఇదే మా పాలసీ – మంత్రి లోకేశ్

AP Minister Nara Lokesh Attends The Brisbane Business Roundtable in Australia

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. గడచిన రెండు రోజులుగా పలు ప్రధాన సంస్థలతో భేటీ అయిన ఆయన నేడు మరో కీలక సమావేశంలో పాల్గొన్నారు. కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బ్రిస్బేన్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా, ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సభ్యులతో లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెట్టుబడి అవకాశాలను అన్వేషించడంపై ఆయన చర్చించారు. ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను లోకేశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

‘విన్-విన్’ భాగస్వామ్యమే తమ లక్ష్యం:

భారతదేశం, ముఖ్యంగా క్వీన్స్‌లాండ్ వ్యాపారవేత్తలు ఏపీతో కలిసి ఎలా పనిచేయగలరో లోకేశ్ వివరించారు. నిజమైన భాగస్వామ్యం అంటే ఇరుపక్షాలు విజయం సాధించడం (Win-Win Partnership) అయినప్పుడే సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు. నమ్మకం, పరస్పర గౌరవం ఆధారంగా ఇలాంటి విజయం-విజయం భాగస్వామ్యాలను సృష్టించడానికి ఏపీలోని వ్యాపార సంస్థలతో కలిసి తాము పనిచేస్తామని హామీ ఇచ్చారు.

విశాఖ సదస్సుకు ఆస్ట్రేలియా పెట్టుబడిదారులకు ఆహ్వానం:

చివరగా, మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియాలోని పెట్టుబడిదారులందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ఆహ్వానించారు. ఈ సదస్సు నవంబర్ 14-15 తేదీల్లో జరగనుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్.. ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఏపీ ప్రభుత్వం విధానమని పేర్కొన్న ఆయన ఈ సదస్సులో పాల్గొని, ఏపీలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here