మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. విచారణను తెలంగాణకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు

Supreme Court Transfers Ex Minister YS Vivekananda Reddy Assassination Case To Telangana,Former Minister Ys Vivekananda Reddy,Ys Vivekananda Development In Murder Case, Former Minister Ys Viveka,Supreme Court Transferred To Telangana,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy, Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణ తీరుపై బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినందున, వారి ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని విచారణను హైదరాబాద్‌ లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా న్యాయస్థానంలో కొనసాగుతోంది.

అయితే సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో ఇది తెలంగాణకు బదిలీ కానుంది. ఇక ఈ కేసు విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్‌ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ తుది తీర్పు వెల్లడించింది. ఇక ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. వేరే రాష్ట్రానికి కేసు బదిలీపై తీర్పు తర్వాతే సీబీఐ పిటిషన్‌పై విచారణ చేస్తామని తెలిపిన సుప్రీం కేసు విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =