ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, ap coronavirus cases today, AP COVID 19 Cases, AP Minister Peddireddy Ramachandra Reddy, AP Minister Peddireddy Ramachandra Reddy Tests Positive, AP Total Positive Cases, COVID-19, Peddireddy Ramachandra Reddy Tests Positive, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి మరియు ఆదిమూలపు సురేష్‌లకు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో సెప్టెంబర్ 1 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,45,139 కు చేరుకుంది. వీరిలో 3,39,876 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 101210 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత ఏపీ రెండో స్థానంలో కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu