తాడిపత్రి నియోజవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. ఘన స్వాగతం పలికిన జేసీ బ్రదర్స్

TDP Senior Leaders JC Brothers Grand Welcomes Nara Lokesh During Yuvagalam Padayatra Entered in Tadipatri Constituency,TDP Senior Leaders JC Brothers,Senior Leaders JC Brothers,JC Brothers Grand Welcomes Nara Lokesh,Nara Lokesh During Yuvagalam Padayatra,Yuvagalam Padayatra Entered in Tadipatri,Mango News,Mango News Telugu,Yuva Galam Padayatra,Nara Lokesh Yuva Galam Padayatra,TDP National General Secretary Nara Lokesh,Nara Lokesh Yuva Galam Padayatra,Nara Lokesh,Nara Lokesh Twitter,Nara Lokesh Padayatra,Nara Lokesh Myneta,Nara Lokesh,Nara Lokesh Latest News,Nara Lokesh Latest News And Updates,Nara Lokesh Latest Updates,Nara Lokesh Padayatra Latest News and Updates

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం శింగనమల నియోజకవర్గంలోని ఉలికుంటపల్లి విడిది కేంద్రం నుండి 67వ రోజు పాదయాత్రను ప్రారంభించిన లోకేష్.. అనంతరం తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌కు టీడీపీ సీనియర్ నేతలు జేసీ బ్రదర్స్ ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి తదితరులు ఎదురేగి స్వాగతం పలికారు. అలాగే వీరితో పాటు పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి చేరుకుని లోకేష్‌కు పూలమాలతో స్వాగతం చెప్పారు.

ఇక అంతకుముందు ఉలికుంటపల్లి విడిది కేంద్రం వద్ద ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి లోకేష మరియు టీడీపీ ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అణ‌గారిన‌వ‌ర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే జ‌యంతి రోజున ఆ మ‌హ‌నీయుని స్మృతిలో నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే మ‌హిళ‌లు, అట్ట‌డుగువ‌ర్గాల ఆత్మ‌గౌర‌వ పోరాటానికి విద్య‌నే ఆయుధంగా అందించిన పూలే ఆశ‌య సాధ‌న‌కి కృషి చేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌ని పేర్కొన్నారు. మరోవైపు లోకేష్ యువగళంకు సంఘీభావంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 3 =