ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆదిత్యనాథ్ దాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన నియామకం పట్ల సీఎం వైఎస్ జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం సీఎస్ గా విధులు నిర్వహిస్తున్న నీలం సాహ్ని డిసెంబర్ 31తో పదవి విరమణ చేయనున్నారు. దీంతో అదేరోజున నూతన సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ