నేడు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది – విశాఖ సభలో ప్రధాని మోదీ

PM Modi Addresses in Public Meeting at Vizag After Launching Several Developmental Projects, PM Modi Launching Several Developmental Projects, PM Modi Addresses in Public Meeting at Vizag, PM Modi Reaches Vizag, AP Governor Biswabhusan, Governor Biswabhusan, AP CM YS Jagan Mohan Reddy, PM Modi in Vizag Public Meeting, AP CM YS Jagan Mohan Reddy, PM Narendra Modi Two-Day Visit, PM Narendra Modi Participates in Huge Road Show at Visakhapatnam, Huge Road Show at Visakhapatnam, PM Modi at Vizag, PM Modi Vizag Tour, PM Modi Vizag Visit, PM Modi in Visakhapatnam, Prime Minister Narendra Modi, Narendra Modi, PM Narendra Modi in Visakhapatnam, PM Modi Vizag Tour News, PM Modi Vizag Tour Latest News And Updates, PM Modi Vizag Tour Live Updates, Mango News, Mango News Telugu

నేడు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల విశాఖపట్నం పర్యటనలో భాగంగా శనివారం ఆయన విశాఖలో నాలుగు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం అలాగే ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నగరంలోని ఏయూలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి ఆకట్టుకున్నారు. ప్రియమైన సోదర, సోదరీమణులకు స్వాగతం అని తెలుగులో చెప్పగానే ప్రాంగణం మొత్తం ప్రజల హర్షధ్వనాలతో మారుమోగింది.

ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ.. కొన్నిరోజుల క్రితం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జన్మదిన వేడుకల్లో పాల్గొనే అదృష్టం కలిగిందని, నేడు మరోసారి ఏపీకి రావడం ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. విశాఖ దేశంలోనే ప్రత్యేకమైన నగరమని, ఇక్కడి ఓడరేవుకు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉందని, పూర్వకాలంలోనే విశాఖ నుంచి ఇటలీ లోని రోమ్ నగరం వరకూ సముద్రం ద్వారా వ్యాపారం జరిగేదని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఏపీతో పాటు విశాఖకు కూడా అతి పెద్ద రోజని తెలిపిన ఆయన దేశంలో విశాఖ ప్రత్యేకమైన నగరమని, రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చూపిస్తున్నారని, ముఖ్యంగా సాంకేతిక, వైద్య రంగాల్లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉందని వెల్లడించారు.

నేడు రూ.15వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతో విశాఖ ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని, ఈ ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి శిఖరాగ్రాలకు చేరుతుందని అన్నారు. ఇక ఏపీకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఎప్పుడు తనను కలిసిన రాష్ట్ర అభివృద్ధిపైనే చర్చించేవారని, రాష్ట్రానికి సంబంధించి కొత్త సంస్థలను, ప్రాజెక్టులను కేటాయించమని కోరేవారని గుర్తు చేసుకున్నారు. అలాగే విశాఖలో మౌలిక వసతుల కల్పనను శరవేగంగా చేస్తున్నామని, ఒకవైపు విశాఖ రైల్వే స్టేషన్, మరోవైపు ఫిషింగ్ హార్బర్ ఆధునీకరిస్తున్నామని తెలియజేశారు. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో స్థానిక మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయని చెప్పిన ప్రధాని మోదీ తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం దేశంలోని సామాన్యుల జీవితాలను మెరుగుపరచడం కోసమేనని స్ఫష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =