జనసేనాని స్ట్రాటజీ అదేనా?

Is That The Jana Sena's Strategy?,Pawan Comments On Kakinada Loksabha YCP Candidate Sunil Says He Came To Varun Tej Marriage,Telugu News,Janasena,Pawan Kalyan,Pithapuram,TDP,YCP,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Janasena News,Kakinada YSRCP MP Candidate Sunil,Kakinada Lok Sabha Elections,Pawan Kalyan Latest News,Pawan Kalyan News,Pawan Kalyan Pressmeet

పవన్‌కు పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ఇక రాజకీయ నేతల్లో పవన్‌కు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ అయితే లెక్కే లేదు. ప్రజారాజ్యం సమయం నుంచి పవన్‌కు పొలిటికల్‌ టచింగ్స్‌ బాగా పెరిగాయి. మధ్యలో  కాస్త రాజకీయాలకు గ్యాప్‌ వచ్చినా తర్వాత జనసేనతో దూసుకొచ్చిన పవన్‌ ఇప్పటికీ పాత విషయాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటారు. ఇటివలీ కాకినాడ లోక్‌సభ వైసీపీ అభ్యర్థి గురించి పవన్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

వారాహిని గిఫ్ట్‌గా ఇచ్చిన నేతకు సపోర్ట్:

జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా కాకినాడ లోక్‌సభ స్థానాన్ని పవన్‌ పార్టీకి కేటాయించిన విషయం తెలిసిందే. స్థానికంగా టీ వ్యాపారి అయిన ఉదయ్ శ్రీనివాస్‌కు టికెట్ దక్కింది. వారాహి వాహనాన్ని కొనుగోలు చేసి పవన్‌కు బహుమతిగా ఇచ్చింది ఉదయ్‌నేనని చెబుతుంటారు. నిజానికి కాకినాడ టికెట్ కోసం కూటమి పెద్దల మధ్య చర్చలు తీవ్రంగా జరిగాయి. అయితే చివరకు కాకినాడ లోక్‌సభ సీటును జనసేనకు ఫిక్స్‌ చేయగా.. పవన్‌ ఆ సీటును ఉదయ్ శ్రీనివాస్‌కు అప్పగించారు. అయితే అదే కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సీహెచ్ సునీల్ గురించి పవన్ కల్యాణ్ ఇటీవలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వరుణ్‌తేజ్‌ పెళ్లిలో సునీల్:

సునీల్ తనకు బాగా తెలుసునని చెప్పిన పవన్‌.. సునీల్ ను చివరిసారిగా ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్ పెళ్లిలో చూశానని చెప్పారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇదంతా చెప్పడం ద్వారా వైసీపీ అభ్యర్థిగా సునీల్ సీరియస్ నెస్ ను దెబ్బతీసేందుకు పవన్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సునీల్ వైసీపీకి చెందినవాడే అయినప్పటికీ తమకు నమ్మకమైన మనిషిగా పవన్‌ చెబుతున్నారు. ఈ క్రమంలోనే సునీల్ ఎప్పుడూ తప్పుడు పార్టీలతో పొత్తు పెట్టుకుంటారని పవన్ వ్యాఖ్యానించారు. 2009లో పవన్ సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి సునీల్ తొలిసారి పోటీ చేశారు. ఆ తర్వాత సునీల్ 2014లో వైసీపీ నుంచి, 2019లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి మూడుసార్లు ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ వైసీపీ టికెట్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =