ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 162 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 29, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,849 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 30, తూర్పుగోదావరిలో 22, చిత్తూరులో 19, గుంటూరులో 17, విశాఖపట్నంలో 17, కృష్ణాలో 15, శ్రీకాకుళంలో 13 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 186 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14492 గా ఉంది.
మరోవైపు ఏపీలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 16కు చేరినట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రకటన చేశారు. బుధవారం ఒక్కరోజే కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చిన వారితో పాటుగా ముగ్గురు ప్రయాణికుల కాంటాక్ట్ వ్యక్తులకు కూడా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. తాజా కేసుల్లో తూర్పుగోదావరిలో మూడు, అనంతపూర్ లో రెండు, కర్నూల్ లో రెండు, పశ్చిమగోదావరి, చిత్తూరు, గుంటూరులో ఒక్కోకేసు చొప్పున నమోదైందని చెప్పారు. ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన వ్యక్తుల ఆరోగ్యం స్థిరంగా ఉందని, అందరూ ఐసోలేషన్ లో ఉన్నారన్నారు. అలాగే వీరందరి కాంటాక్ట్ వ్యక్తులను ట్రేస్ చేసి, పరీక్షలు నిర్వహించామని, పాజిటివ్ గా తేలిన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టు తెలిపారు.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 29, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 3,12,62,099
- గత 24 గంటల్లో (9AM-9AM) నిర్వహించిన కరోనా పరీక్షలు : 31,743
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 20,76,849
- కొత్తగా నమోదైన కేసులు : 162
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 20,61,308
- యాక్టీవ్ కేసులు : 1,049
- మొత్తం మరణాల సంఖ్య : 14,492
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ