మంత్రి కొడాలి నానికి షోకాజు నోటీసు ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్

AP SEC Nimmagadda Ramesh Issues Show Cause Notice to Minister Kodali Nani,Mango News,Mango News Telugu,Nimmagadda Ramesh Issued Show Cause Notice to Kodali Nani,SEC slaps Show-Cause notice to YSRCP Minister,Nimmagadda Ramesh Issues Show Cause Notice to Minister Kodali Nani,AP SEC Nimmagadda Ramesh Issues Notice to Minister Kodali Nani

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని మాట్లాడిన సందర్భంలో ఎస్ఈసీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంపై బహిరంగ ప్రకటన చేయాలని చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా మంత్రి కొడాలి నాని వ్యక్తిగతంగా కానీ లేదా తన ప్రతినిధి ద్వారా గాని సమాధానం ఇవ్వాలని జారీచేసిన షోకాజ్‌ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాడు పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 13 వ తేదీన రెండో విడత ఎన్నికలు పూర్తయ్యేవరకు మీడియాతో మాట్లాడవద్దని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ