ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

A Special Story On Famous Psychologist BV Pattabhiram,Mango News,Mango News Telugu,BV Pattabhiram,Birthday A Special Story On Famous Psychologist BV Pattabhiram,BV Pattabhiram Latest News,Happy Birthday BV Pattabhiram,BV Pattabhiram Birthday Celebrations,Famous Psychologist BV Pattabhiram,Happy Birthday Famous Psychologist BV Pattabhiram

ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ ఈ రోజు 72వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీవీ పట్టాభిరామ్ గారికి మ్యాంగో న్యూస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. వ్యక్తిత్వ వికాస పుస్తకాల ద్వారా ఎందరో విద్యార్థుల గొప్ప భవిష్యత్ కు బాటలు వేసి, కౌన్సెలింగ్ ద్వారా మరెందరో జీవితాల్లో బీవీ పట్టాభిరామ్ వెలుగులు నింపారు. అలాగే తన అమూల్యమైన సలహాలు, సూచనలతో విద్యార్థులు, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు యూట్యూబ్ లో “పట్టాభి రామబాణం” పేరుతో ఎన్ని అంశాలపై వీడియోలు అందిస్తున్నారు.

డాక్టర్ బీవీ పట్టాభిరామ్ సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌లో పిజి డిప్లొమా మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి యోగా అండ్ హిప్నోటిజం-ఎ ప్రాగ్మాటిక్ అప్రోచ్ పై పిహెచ్‌డి చేశారు. సాఫ్ట్ స్కిల్స్, హెచ్‌ఆర్‌డిపై ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించారు. దేశంలోనే కాకుండా యుఎస్ఎ, ఆస్ట్రేలియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్ మరియు అరబ్ దేశాలలో వివిధ అంశాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్, పారిశ్రామిక వేత్తలకు, నాయకులకు ఒత్తిడి, భయాలను అధిగమించడానికి, కావాల్సిన విజయాన్ని సాధించడానికి ప్రేరణ అందించేలా ఎన్నో సెషన్స్ నిర్వహించారు. అలాగే మ్యాజిక్ కళ పట్ల ఆయనకున్న మక్కువ దేశంలో ఆయనను అత్యంత ప్రసిద్ధ మాంత్రికులలో ఒకరిగా నిలిపింది. భారతదేశంలో మొట్టమొదటి మ్యాజిక్ పాఠశాలను ప్రారంభించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందారు. ఎందరో ఇంద్రజాలికుల ఎదుగుదలకు ప్రేరణగా నిలిచారు.

మరోవైపు బీవీ పట్టాభిరామ్ దేశం నుంచే గాకా విదేశాల నుంచి కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల నుండి అనేక అవార్డులు, ప్రశంసలు, గుర్తింపులను పొందారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం 1983 సంవత్సరంలో హిప్నాసిస్‌పై ఆయన చేసిన కృషికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అలాగే అమెరికాలోని నాష్‌విల్లే మరియు న్యూ ఓర్లీన్స్ మేయర్‌లు ఆయనకు గౌరవ పౌరసత్వం ఇచ్చారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 14 =