ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అయ్యన్నపాత్రుడి తరుపున స్పీకర్‌గా జనసేనాని పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే అయ్యన్నకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో.. అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమయింది. ఈ మేరకు శనివారం అయ్యన్నపాత్రుడిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సభాపతి స్థానంలో కుర్చేబెట్టారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయ్యన్నపాత్రుడికి నాలుగు సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అయ్యన్న రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు పదిసార్లు అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి పోటీ చేసి ఏడుసార్లు గెలుపొందారు. అలాగే ఓ సారి ఎంపీగా కూడా గెలుపొంది పార్లమెంట్‌కు వెళ్లారు. ఇప్పటి వరకు అయిదు ప్రభుత్వాల్లో అయ్యన్నపాత్రుడు మంత్రిగా పనిచేశారు. తాజాగా ఏపీలో మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈసారి ఆయనకు మంత్రి పదవి కాకుండా.. స్పీకర్ పదవి దక్కింది.
అయ్యన్నను సభాపతి స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఆయనపై ప్రశంసలు కురిపించారు. అయ్యన్నపాత్రుడు కరుడుగట్టిన పసుపు యోధుడని, 42 ఏళ్లుగా పసుపు జెండా మోసిన పోరాట యోధుడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ అయ్యన్న అని అన్నారు. 42 ఏళ్లుగా ఒకే నియోజకవర్గాన్ని నమ్ముకున్న వ్యక్తి అని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అయ్యన్నపై 20 అక్రమ కేసులు పెట్టారని.. ఎన్నో విధాలుగా ఆయన్ను వేధించారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY