టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విడుదల

Ap Political News, Ap Political News Live Updates, AP temple vandalaism, AP temple vandalaism issue, kala venkata rao arrest, kala venkata rao arrest news, Kala Venkata Rao Arrested and Released, Kala Venkatrao, Mango News, Mango News Telugu, TDP leader Kimidi Kala Venkatrao released, TDP leader Kimidi Kala Venkatrao released by police, TDP Senior Leader Kala Venkata Rao

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కళా వెంకట్రావును బుధవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి పర్యటన సమయంలో కారుపై దాడి చేశారన్న అభియోగంపై అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం ఆయనను రాత్రి పదకొండు గంటల సమయంలో విడుదల చేశారు. ముందుగా వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఆయన వాహన శ్రేణిపై రాళ్లు, చెప్పులు వేయించారనే అభియోగంపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావుపై ఇటీవల కేసు నమోదైంది.

ఈ కేసులోనే కళా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కళా వెంకట్రావుతో పాటు ఆయన పీఏ వెంకటనాయుడు, అనుచరుడు శంకరావును తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లి, రాజాం ప్రాంతాల టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. అయితే కళా వెంకట్రావుకు సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు జారీ చేసి, ఆయన్ను విచారించి రాత్రి 11.15 గంటల సమయంలో పోలీసులు విడిచిపెట్టారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకే పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చామన్నారు.

విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం, సంఘటన వివరాలు తెలుసుకొనేందుకుగాను కళా వెంకట్రావును హాజరు కావాల్సిందిగా పోలీసులు ఇప్పటికే పలుమార్లు కోరడమైనది. కానీ కళా వెంకట్రావు సరిగ్గా స్పందించనందున ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు అధికారి అయిన విజయనగరం రూరల్ సిఐ జనవరి 20, బుధవారం నాడు కళా వెంకటరావును విచారణ నిమిత్తం పిలిచి, విచారణ అనంతరం నోటీసు ఇచ్చి తిరిగి పంపించారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే కళా వెంకట్రావును పిలవడం, సంఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకొని, నోటీసు ఇవ్వడం, విచారణ పూర్తయిన తరువాత విడిచి పెట్టడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానమే. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉందని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =