ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(50) సోమవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడించారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో ఆయన కన్ను మూయడం బాధాకరమన్నారు. విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారని, గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కళ్యాణ్ భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డికి, కుటుంబ సభ్యులకు తన తరఫున, జనసేన పక్షాన పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతమ రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి తన మనసు అంగీకరించడం లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకే నేడు (ఫిబ్రవరి 21, సోమవారం) జరగవలసిన భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించామని, ఈ వేడుక త్వరలోనే జరుగుతుందని చెప్పారు. ఈ వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ







































