తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి మే 30న మేనిఫెస్టోను రిలీజ్ చేయడం ఆలస్యం.. అధికారపార్టీ దానిలోని లోటుపాట్లపై బూతద్ధం తీసుకుని రెడీ అయిపోయింది. మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర ఎందుకు లేదు..? బీజేపీ ఫోటోలు ఎందుకు లేవంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
మేనిఫెస్టోపై ఎదురవబోయే ప్రశ్నలకు చంద్రబాబు క్లియర్ కట్ గా జవాబులు ముందే చెప్పినా కూడా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలంతా రకరకాలుగా ప్రశ్నించారు. అంతేకాదు సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా నెగటివ్ ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఇలాంటివాటన్నిటికీ చెక్ పెట్టేలా బీజేపీ చేసిన ట్వీట్..అందరి ప్రశ్నలకు జవాబు చెప్పకనే చెప్పినట్లు అయింది.
టీడీపీ, జనసేన మేనిఫెస్టోని తాము స్వాగతిస్తున్నట్లుగా బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతాలోబ పోస్ట్ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం తెలుగు దేశం పార్టీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో – 2024 ను బీజేపీ స్వాగతిస్తోంది’ అని అధికారిక ఎక్స్ ఖాతాలో భారతీయ జనతా పార్టీ ట్వీట్ చేసింది.
ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు.. ఇప్పటి వరకూ రకరకాలుగా మాట్లాడిన వైసీపీ నేతల, విమర్శకులకు జవాబు చెప్పినట్లు అయింది. కూటమి మేనిఫెస్టోపై వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో ఘాటు కామెంట్లు చేస్తూ మాట్లాడారు. అయితే బీజేపీ అధికారిక ట్వీట్‌తో.. ఇప్పటి వరకూ ఏపీ ప్రజల్లో, టీడీపీ, జనసేన శ్రేణుల్లో కూడా నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు బీజేపీ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైసీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY