కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడంలో టీడీపీ కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈసారి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ స్థానాలు దక్కాయి. దీంతో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి పార్లమెంట్‌లో టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉంది. జనసేనతో కలుపుకొని 18 మంది ఉన్నారు. దీంతో టీడీపీకి, చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అండగా ఉంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు విజ్ఞప్తులు పంపించగా అందుకు మోడీ అంగీకారం తెలిపారు. తాజాగా మరో విజ్ఞప్తికి కూడా మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే సీఎస్‌న మార్చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జవహర్ రెడ్డి సీఎస్‌గా ఉన్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన్ను తొలగించి నీరబ్ కుమార్ ప్రసాద్‌ను చంద్రబాబు నాయుడు సీఎస్‌గా నియమించారు. అయితే ఆయన్ను నియమించి నెలు రోజులు కూడా కాలేదు. కానీ నీరబ్ పదవీ కాలం ఈనెలతో ముగియనుంది. దీంతో నీరబ్ కుమార్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశారు.
చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ డీవోపీటీ అంగీకరించింది. నీరబ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగస్తూ.. గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో ఆరు నెలల పాటు నీరబ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా కొనసానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE