చంద్రబాబు క్లారిటీ ఇచ్చేసినట్లేనా?

No ticket, Chandrababu,TDP,JANASENA,Lokesh,Paritala, JC Diwakar Reddy, Kotla Jayaprakash Reddy, Pusapati Ashok Gajapati Raju, KE Krishnamurthy, Andhra Pradesh News Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
No ticket, Chandrababu,TDP,JANASENA,Lokesh,Paritala, JC Diwakar Reddy, Kotla Jayaprakash Reddy, Pusapati Ashok Gajapati Raju, KE Krishnamurthy

టీడీపీ అధినేత చంద్రబాబు రాబోయే ఎన్నికల కోసం స్పీడు పెంచేశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత మరింత దూకుడు పెంచిన చంద్రబాబు.. పొత్తులు, సీట్లపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈ ఎన్నికలలో సీట్లపై ఓ క్లారిటీ  కూడా ఇచ్చేశారట.

దాదాపు 15 నుంచి 20 మందికి ఈసారి టికెట్ ఉండదన్న సంకేతాలను  పార్టీ నేతలకు ఇన్ డైరెక్ట్‌గా పంపారట. దీంతో పాటు ఒక కుటుంబంలో ఒకటే సీటు అనే విషయంపైన కూడా క్లారిటీ ఇచ్చేశారట. పార్టీలో ఎంత విధేయులైనా, సీనియర్లు అయినా  సరే ఆ కుటుంబంలో ఒక టికెట్ మాత్రమేనని చెప్పేసారట. అయితే ఇప్పటికే పరిటాల, జేసీ దివాకర్ రెడ్డి, కోట్ల జయప్రకాష్ రెడ్డి, పూసపాటి అశోక్ గజపతి రాజు,కేఈ కృష్ణమూర్తి  కుటుంబాలలో రెండో టికెట్‌పైన గంపెడాశలు పెట్టుకున్నారు. దీంతో ఇప్పుడు  వీరికి కూడా ఒకే టికెట్ అనే సంకేతాలను చంద్రబాబు పంపినట్లు అయింది.

అటు మైలవరం టికెట్ విషయంపైన  కూడా టీడీపీ అధినేత ఓ కొలిక్కి వచ్చారట. సుధీర్ఘ కసరత్తుల తర్వాత మైలవరం నియోజకవర్గంలో అభ్యర్ధిని మార్చాలని చంద్రబాబు నిర్ణయించారట. ఇదే విషయాన్ని టీడీపీ ఇంచార్జి దేవినేని ఉమకు కూడా ఇది వరకే ఆదేశాలు  ఇచ్చారట. ఇక పెడన విషయంలో కూడా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు.అంతా కలిసికట్టుగా ఉంటూ జాగ్రత్తగా పని చేసుకుంటే టీడీపీదే  విజయమని చంద్రబాబు అందరికీ చెప్పారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పని చేయాలని బాబు సూచించారు.

మరోవైపు ఇంచార్జుల మార్పుతో పాటు.. సీట్ల నిరాకరణపై వైసీపీలో విభేదాలు తలెత్తినట్లే టీడీపీలోనూ జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనిని చంద్రబాబు ఎలా మ్యానేజ్ చేసి ఎన్నికలలో ముందుకు వెళతారో అన్నది చూడాల్సిందే  అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + ten =