ఏపీ రాజధాని అంశంపై మొదటిసారిగా స్పందించిన కేంద్రం

Andhra Pradesh Capital Decision, Andhra Pradesh Latest News, AP Breaking News, AP Capital Amaravati Issue, AP Capital Issue, AP Capital Latest News, Central Govt AP Capital Decision, Central Govt Decision On AP Capital, Mango News Telugu
పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రప్రభుత్వం మొదటిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీలో మూడురాజధానుల ఏర్పాటు అంశంపై లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలనే అధికారం రాష్ట్రానికే ఉంటుందని, అది రాష్ట్ర పరిధిలోని అంశంమని నిత్యానంద్ రాయ్ తెలిపారు. ‘2015 ఏప్రిల్ 23న విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ, నోటిఫై చేసింది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని మీడియాలో వార్తల ద్వారానే తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో తమ జోక్యం ఉండదని’ నిత్యానంద్ రాయ్ సమాధానమిచ్చారు.

[subscribe]