ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. గతంలో శపథం చేసినట్లుగానే ముఖ్యమంత్రి అయ్యాకనే చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఆయన చేసిన శపథం నెరవేరడంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న చంద్రబాబు సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అప్పటి మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీలో పలు వ్యాఖ్యలు చేశారు. దానికి కొందంరు వైసీపీ నేతలు కూడా వంతపాడారు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి సభలో అడుగుపెడుతానని శపథం చేసి మరీ అక్కడి నుంచి వెళ్లారు.
ఇన్నాళ్లూ పరువు కోసం బతికానని.. అటువంటిది సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారని ఆనాడూ చంద్రబాబు అన్నారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని ఇటువంటి సభలో తాను ఉండలేనని వెల్లడించారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడుతానని.. లేకపోతే తనకు రాజకీయాలే వద్దు అని ఆనాడు చంద్రబాబు నాయుడు శపథం చేశారు. ఇప్పుడు శపథం నెరవేరి ముఖ్యమంత్రి కావడంతో చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లారు. ముందుగా అసెంబ్లీ మెట్ల వద్ద చంద్రబాబు నాయుడు ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. ఆ తర్వాత శాసనసభాపక్ష నేత కార్యాలయంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆ తర్వాత సభలో చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE