కోస్తా జిల్లాల్లో టీడీపీ కీలక నేత వంగవీటి రాధా. గత రెండు దశాబ్దాలుగా చట్టసభలో అడుగుపెట్టేందుకు రాధా ప్రయత్నిస్తున్నారు. కానీ అదృష్టం ఆయన తలుపుతట్టలేదు. వంగవీటి మోహనరంగా తనయుడయిన రాధా.. 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. 2009 ఎన్నికలకు ముందు రాధా.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి మరోసారి ఓడిపోయారు.
ఇక 2019 ఎన్నికలకు ముందు రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో రాధాను చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించకుండా పక్కకు పెట్టారు. కనీసం 2024లో అయినా టికెట్ దక్కుతుందని రాధా ఆశించారు. కానీ ఈసారి కూడా నిరాశే ఎదురయింది. అయినప్పటికి కూడా ఆయన పార్టీ మారకుండా టీడీపీ కూటమి గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాపు ఓట్లను టీడీపీ కూటమి వైపు మళ్లించేందుకు కృషి చేశారు. టీడీపీ గెలుపు కూటమిలో కీలక పాత్ర పోషించారు.
అయితే త్వరలోనే వంగవీటి రాధా కృషికి తగిన ఫలితం దక్కపోతోందని తెలుస్తోంది. వంగవీటి రాధాకు కీలక పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట. ముందుగా ఎమ్మెల్సీని చేసి.. ఆ తర్వాత సమయం చూసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికే కేబినెట్‌లో ఒక పదవి.. శాసనమండలిలో నాలుగు ఖాళీలు ఉన్నాయి. అటు ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో బీసీలకు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇక కాపు కోటాలో వంగవీటి రాధాకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. త్వరలోనే దీనిపై చంద్రబాబు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE