సీఎం, మాజీ సీఎంలలో ఎవరు సంపన్నులు?

Chandrababu's Assets v/s Jagan's Assets, Jagan Property, Chandrababu Property, Chandrababu's Assets, Jagan's Assets, CM and EX-CM?, YCP, TDP, Chandrababu, Jagan, Lok Sabha Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Chandrababu's assets v/s Jagan's assets, Chandrababu's assets, Jagan's assets, CM and ex-CM?,YCP, TDP, Chandrababu, Jagan,

ఏపీలో ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న సమయంలో.. ఆయా అభ్యర్థులు తమ అఫిడవిట్ లలో పేర్కొన్న ఆస్తులు, అప్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎవరి ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? వారి ఆస్తులెంత? వారికున్న అప్పులేంటి అనే లెక్కలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా సీఎం, మాజీ సీఎంలలో ఎవరు సంపన్నులు అన్న టాపిక్ నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ ఆస్తుల డేటా ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే జగన్ కుటుంబం కంటే చంద్రబాబు కుటుంబానికి ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తేలింది.

జగన్ తాను, తన సతీమణి భారతి రెడ్డితో పాటు.. తన ఇద్దరు కుమార్తెలకు సంబంధించిన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చారు. అయితే ఈ ఆస్తులలో చంద్రబాబు కుటుంబానిదే పైచేయిగా కనిపిస్తోంది. ఇక చంద్రబాబు విషయానికి వస్తే చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ లకు ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి తమ అఫిడవిట్లో చంద్రబాబు, నారా లోకేష్ అందించారు.

నారా చంద్రబాబు నాయుడు,నారా భువనేశ్వరి దంపతుల పేరు మీద ఉన్న ఆస్తులు 931 కోట్ల రూపాయలు కాగా, నారా లోకేష్ కుటుంబ ఆస్తులు విలువ రూ. 542 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ రూ. 14వందల73 కోట్లుగా ఉంది. 2019 ఎన్నికల సమయంతో పోలిస్తే.. 2024లో జరుగుతున్న ఎన్నికల సమయానికి చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల విలువ 39 శాతం పెరిగాయి.

వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ఆస్తుల విషయానికి వస్తే మొత్తం ఆస్తులు 779.8 కోట్లు కాగా ఇందులో జగన్ మోహన్ రెడ్డి పేరుతో ఉన్న ఆస్తులు రూ. 529.87 కోట్లు కాగా,జగన్ సతీమణి భారతి పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 176.30కోట్లుగా ఉంది. ఈ ఐదేళ్లలో జగన్ ఆస్తుల విలువ 41 శాతం పెరిగింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY